అమాంతం సైకిల్ పైకెత్తి... టిడిపి శ్రేణుల్లో జోష్ నింపిన నారా లోకేష్

Feb 25, 2021, 1:42 PM IST

 మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నందిగామ లో పర్యటన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ధీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆమెను పరామర్శించారు లోకేష్.    తెలుగుదేశం పార్టీ తరపున అన్నివిధాలుగా సౌమ్యకు అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటికి భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అంతకుముందు నందిగామకు చేరుకున్న లోకేష్ కు కూడా టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనపై దారిపొడవునా పూల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే తమ పార్టీ గుర్తయిన సైకిల్ ను లోకేష్ అమాంతం పైకెత్తి కార్యకర్తల్లో మరింత జోష్ నింపారు. ఇలా భారీ  ర్యాలీతో సౌమ్య ఇంటికి చేరుకున్నారు నారా లోకేష్.