Nov 25, 2019, 10:06 AM IST
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం సమీపంలోని అన్నవరపులంక రీచ్ వద్ద ఇసుక తవ్వకాల్లో వివాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు
ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోగా, ఇద్దరికి తలలు పగిలాయి. కొల్లిపర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.