Jul 17, 2020, 11:11 AM IST
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాడేపల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాలనుంచి భారీగా వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద గంట గంటకు వరద పెరుగుతున్నది. నిన్న సాయంత్రం 40 గేట్లు ఎత్తివేసి 29 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.