
రాజోలు నియోజకవర్గంలో ‘పల్లె పండుగ 2.0’ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామీణాభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై కీలక సందేశం ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ 2.0 కార్యక్రమం విశేష స్పందన పొందుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.