Jan 19, 2022, 3:29 PM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగుల నిరసనల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పీఆర్సీ అమలుకోసం విడుదల చేసిన జీవోలతో భగ్గుమన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని... అప్పటివరకు తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.