vuukle one pixel image

వినుకొండలో క్షుద్రపూజలు కలకలం... ఒకే ఇంట్లో తల్లీకొడుకు మృతి

Sep 21, 2022, 5:02 PM IST

పల్నాడు జిల్లా వినుకొండలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శ్రీనివాసనగర్ కాలనీలోని వార్డు వాలంటీర్ శ్రీనివాసరావు ఇంటిపక్కన జిల్లేడు చెట్టుకు తాళితో పాటు మట్టికుండలు, చెక్క బొమ్మలు వంటి వస్తువులు లభించాయి. ఈ క్షుద్ర పూజల కారణంగానే ఇటీవల తన తండ్రి కోటేశ్వరరావు, నాన్నమ్మ వెంకటమ్మ మృతిచెందినట్లు వాలంటీర్ ఆందోళన వ్యక్తం చేసారు. క్షుద్ర పూజలు చేసిన మాంత్రికుడు, చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని... క్షుద్ర పూజల సామాగ్రిని తొలగించాలని శ్రీనివాసరావు కుటుంబం డిమాండ్ చేస్తోంది.