పవిత్ర లోకేష్ నరేష్ ఎనర్జీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలని వైరల్ చేస్తూ నెటిజన్లు ట్రోలింగ్ కి దిగుతున్నారు. పవిత్ర మాట్లాడుతూ.. 10 మందికి ఉండే శక్తి నరేష్ ఒక్కరిలో ఉంది. మనం ఆయనతో పోటీ పడలేం. నేను రాత్రి అయితే త్వరగా అలసిపోతాను. ఆయన స్టాఫ్ కూడా అలసిపోతారు. మిగిలిన వర్క్ నువ్వే చూసుకో అని చెప్పేస్తానని, ఆయన మాత్రం అలసి పోరు అని పవిత్ర పేర్కొంది. వర్క్ విషయంలో నరేష్ అంత ఎనర్జిటిక్ గా, డెడికేటెడ్ గా ఉంటారనేది పవిత్ర ఉద్దేశం.