Mar 3, 2022, 3:57 PM IST
అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. సిఆర్డీఎ చట్టం ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు రాజధానులు, సీఆర్డీఎ రద్దుపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఆరు నెలల్లోగా అభివృద్ధి ప్రణాళికలను పూర్తి చేయాలని చెప్పింది. అదే విధంగా భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని హైకోర్టు జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.