Mar 31, 2022, 5:27 PM IST
అమరావతి: వరుస ఆందోళనలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష టిడిపి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బడ్జెట్ సమావేశాల సమయంలో కల్తీ మద్యంపై ఆందోళనలు చేపట్టిన టిడిపి తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన బాట పట్టింది. ఈ క్రమంలో సామాన్య ప్రజలపై విద్యుత్ చార్జీల బారం మోపడాన్ని నిరసిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న నిరసన చేపట్టారు. పూర్వకాలంలో వెలుతురు కోసం ఉపయోగించే లాంతర్లను పట్టుకుని మంగళగిరిలోని టిడిపి కార్యాలయానికి చేరకున్నారు. అంధకార ప్రదేశ్, బాదుడే... బాదుడు అని రాసిన స్టిక్కర్లను అతికించిన లాంతరను పట్టుకుని లోకేష్ నిరసన చేపట్టారు.