vuukle one pixel image

క్రాస్ ఓటింగ్ వైసిపి ఎమ్మెల్యేలు ఎవరంటే...: వల్లభనేని వంశీ సంచలనం

Naresh Kumar  | Published: Mar 24, 2023, 1:52 PM IST

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయంతో ఏపీ రాజకీయాల్లో ముసలం మొదలయ్యింది. వైసిపి ఎమ్మెల్యేల్లో ఎవరో క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం వల్ల టిడిపి అనూహ్యంగా విజయం సాధించింది. ఇలా క్రాస్ ఓటింగ్ కు చేసిన వైసిపి ఎమ్మెల్యేలు ఎవరో గుర్తించినట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు.పనితీరు సరిగ్గా లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ హెచ్చరించారని... ఆ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అన్నారు. టిడిపి నుండి వైసిపిలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని.. . వైసిపి ఎమ్మెల్యేలు దీనికి పాల్పడ్డారని అన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో వైసిపి పెద్దలు గుర్తించారని... ఇప్పటికే వారి పేర్లు కూడా జగన్ వద్దకు చేరాయన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఎవరో త్వరలోనే పార్టీ బయటపెడుతుందని... వారిపై తప్పకుండా కఠిన చర్యలు వుంటాయని గన్నవరం ఎమ్మెల్యే వంశీ పేర్కొన్నారు.