విజ‌య‌వాడ‌ను మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి వెలంపల్లి

Mar 18, 2021, 5:18 PM IST

విజ‌య‌వాడ‌ను మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తాం అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. గురువారం ప్రమాణ స్వీకారానికి వెళ్ళే ముందు కార్పొరేటర్లతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళుల‌ర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మేయర్ గా రాయన భాగ్యలక్ష్మి, బెల్లం దుర్గని డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారని తెలిపారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అదేశాల‌తో జనరల్ బీసీ లకు మేయర్ పదవి ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.  20 నెలల పాలనలో నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేయ‌డం జ‌రిగింద‌న్నారు.  గతంలో అధికారం ఉన్న టీడీపీ నగరాభివృద్ధి ని విస్మరించిందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు.