
విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం ఎంతో మహత్తరమైన సేవ అని, ఒక్క యూనిట్ రక్తం అనేక మంది ప్రాణాలను కాపాడగలదని అన్నారు. యువత ముందుకు వచ్చి తరచుగా రక్తదానం చేయాలని, సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.