Mar 7, 2023, 11:42 AM IST
విశాఖపట్నం : ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పారిశ్రామికవేత్తలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొత్తం 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వైసిపి ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే ఈ పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యేలా చూసేందుకు సీఎస్ హోదాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసేందుకు జగన్ సర్కార్ సిద్దమయ్యింది. పారిశ్రామికవేత్తలతో నిత్యం సంప్రదింపులు జరపుతూ... వారికి అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఈ కమిటీ పనిచేయనుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.