ముత్యాలమ్మపాలెం సాగరతీరంలో నిర్వహించనున్న అనకాపల్లి ఉత్సవాలను పగడ్బందీగా, భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, సముద్ర తీరంలో గజ ఈతగాళ్లను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.