విశాఖలో విషాదం... మహిళా దినోత్సవం రోజే వివాహిత సూసైడ్

Mar 8, 2023, 1:44 PM IST

విశాఖపట్నం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాదం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. గాజువాక ప్రాంతంలోని శ్రీహరిపురం ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో నివాసముంటున్న వివాహిత నీలంశెట్టి కనకస్వాతి(31) మూడో అంతస్తు నుండి దూకి బలవన్మరణానికి పాల్పడింది.తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఘటనాస్థలిలోనే మృతిచెందింది. వివాహిత ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న  పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.