Nov 29, 2019, 8:49 PM IST
మచిలీపట్నం: అగ్రకుల రాజకీయ పార్టీల అంతం మాలల పంతం అన్న నినాదాన్ని అందుకుని ఉద్యమానికి సిద్దమైనట్లు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య వెల్లడించారు. పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టకుండా అడ్డుకునేందుకు మాలాలందరు సైనికుల్లా ఢిల్లీ రావాలని ఆయన పిలుపునిచ్చారు. డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ''హలో మాల చలో ఢిల్లీ'' గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.