వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో చేయలేని సంక్షేమం కూటమి ప్రభుత్వం 9 నెలల్లో చేసి చూపించిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. రూ.200 పింఛన్‌ను రూ.వెయికి పెంచింది చంద్రబాబేనని... రూ.వెయ్యిని 2వేలకి పెంచింది ఆయనేనని తెలిపారు. ఆ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే రూ.4వేలకు పెంచామని గుర్తుచేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ విజయోత్సవంలో లోకేశ్ మాట్లాడారు. వచ్చే మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని తెలిపారు.