Jul 9, 2020, 4:20 PM IST
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం నాడు చోడవరం మండలంలోని గంధవరం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్మించనున్న విత్తన శుద్ధి కేంద్రం మరియు గోదాంను ఆయన, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.