Nov 25, 2019, 4:32 PM IST
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కథ విషాదాంతమైంది. ఇంద్రపాలెం గేట్ల వద్ద చిన్నారి మృతదేహాన్ని ధర్మాడి సత్యం బృందం సోమవారం గుర్తించింది. మృతదేహాన్ని ఇంద్రపాలo ఉప్పేటేరు లాకుల వద్దకు మత్య్సకారులు తీసుకుని వచ్చారు. సంఘటనా స్థలానికి డి ఏస్ పి పోలీసు బలగాలతో చేరుకున్నారు. మూడు రోజుల క్రితం పాఠశాల నుంచి దీప్తిశ్రీ అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. పాపను తానే ఉప్పుటేరులో తోసేసినట్లుగా సవతి తల్లి శాంతకుమారి పోలీసులకు తెలిపింది.