మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనపై మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు. తాము అడ్డుకొని ఉంటే జగన్ రాప్తాడులో అడుగు కూడా పెట్టేవాడు కాదన్నారు. తామెక్కడా అడ్డుపడలేదని, పోలీసులు అవసరమైన భద్రత ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. తల్లికి, చెల్లికి న్యాయం లేని జగన్.. లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.