Galam Venkata Rao | Published: Apr 4, 2025, 5:00 PM IST
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లీజు గడువు ముగిసినా మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు జరిపారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా... ఆయన ఇంటి వద్ద అందుబాటులో లేరు. దీంతో పోలీసులు కాకాణి ఇంటికి నోటీసులు అంటించాల్సిన పరిస్థితి. దీనికి తోడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తాజాగా అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుంది? కాకాణి అరెస్టు ఖాయమేనా....?