Dec 8, 2021, 3:10 PM IST
విజయవాడ: విజయవాడ పోలీస్ మిషనర్ గా సీనియర్ ఐపిఎస్ అధికారి కాంతి రాణా టాటా ఇవాళ(బుధవారం) బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడలో మంచి మార్పులకు శ్రీకారం చూడతాననని ఆయన ప్రకటించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళల భద్రత, నేరాలు, గంజాయిపై ఉక్కుపాదం మోపుతానని తెలిపారు.పోలీస్ అధికారులు, ఉద్యోగులలో అవినీతి, నిర్లక్ష్యం సహించబోనని హెచ్చరించారు. మత్తు పదార్దాలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేక దృష్టిపెడతానని సిపి కాంతి రాణా టాటా వెల్లడించారు.