ఇప్పటంలో హైటెన్షన్... భారీ పోలీస్ పహారాలో ఇళ్ల కూల్చివేతలు, జనసేన ఆందోళనలు

Mar 4, 2023, 1:22 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్ళీ ఇళ్ళ కూల్చివేతలు ప్రారంభమవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, రాజకీయ పార్టీల నాయకులు ఈ కూల్చివేతలను అడ్డుకునే అవకాశాలుండటంతో గ్రామంలో భారీగా పోలీసులను మొహరించారు. ఇప్పటికే బాధితులకు నోటీసులు ఇచ్చిన అధికారులు ఇవాళ ఉదయమే తవ్వకాలకు సబంధించిన వాహనాలతో ఇప్పటం చేరుకున్నారు.ఇది తెలిసి ఇప్పటం బాధితులకు మొదటినుండి అండగా నిలుస్తున్న జనసేన పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. అధికారులు కూల్చివేతలు చేపడుతున్న ఇళ్లవద్దకు వెళ్లి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. తమ ఇళ్ల కూల్చివేతలను కొందరు బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ మహిళ తన ఇంటి గోడవరకు మాత్రమే కూలుస్తామని నోటీసులిచ్చి ఇప్పుడు ఇల్లు తొలగిస్తామని అంటున్నారంటూ ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.తమ ఇంటిని తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ తాడు పట్టుకుని అధికారులను హెచ్చరించింది. ఇలా ఇప్పటం గ్రామంలో బాధితుల ఆందోళనలు, అధికారులు, పోలీసులతో ఉద్రిక్తత నెలకొంది.