Mar 26, 2022, 12:27 PM IST
కైకలూరు: కృష్ణా జిల్లా లో గుట్కా మాఫియా గుట్టు రట్టయ్యింది.గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా లారీలో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయల విలువైన గుట్కాను మండవల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని లారీని సీజ్ చేసారు. మరిన్ని వివరాలు ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించనున్నారు...