Aug 11, 2020, 5:07 PM IST
రోడ్డు ప్రమాదంలో మహిళా ఏ ఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన కర్నూలు లో చోటుచేసుకుంది. నగర సమీపంలోని పంచాలింగల హైవే పైతుంగభద్ర నదీ వద్దనున్న జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని డీసీయం ఢి కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మాధవి అక్కడికక్కడే మృతి చెందిది. మరో వ్యక్తి కి స్వల్పగాయాలు అయ్యాయి. మృతి చెందిన కానిస్టేబులుకు నాలుగు రోజుల క్రితం వివాహం నిశ్చితార్థం జరిగింది. ఇంతలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.