Jul 20, 2020, 6:01 PM IST
విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజు పేటలో స్థానికులు ఎనిమిది అడుగుల కొండ చిలువను చంపేశారు. గత నెలరోజులుగా ఆవు పెయ్యలను, మేక పిల్లలను చంపి తింటుందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టుకోలేకపోయామని వారు అంటున్నారు. ఈ రోజు మాటువేసి కొండచిలువను హతమర్చామని చెబుుతున్నారు.