Nov 28, 2019, 12:14 PM IST
నందిగామ యం.ఆర్.ఓ కార్యాలయం ముందు నాగలితో దుర్గాప్రసాద్ అనే రైతు వినూత్న నిరసన చేపట్టాడు. తన తల్లికి చెందిన భూమి సర్వేయర్ సర్వే చేయకుండానే చేసినట్టు అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆక్రమణదారులకు అండగా రెవెన్యూ శాఖ ఉంటోందని, తనకు న్యాయం చేయకపోతే వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ముందు నిరసన చేపడతానని హెచ్చరించాడు.