స్టీల్ ప్లాంట్ భూములు అమ్మడానికి అసలు నువ్వెవరు..: జగన్ పై దేవినేని ఉమ సీరియస్

Mar 5, 2021, 3:18 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ 'ఉక్కు పరిరక్షణ పోరాట సమితి' ఇచ్చిన పిలుపు మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో టిడిపి శ్రేణులు బంధ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ... తాడేపల్లి రాజ ప్రసాదంలో పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసారని... వారితో ఏ లాలూచీ చేసుకున్నారో ప్రజలకు చెప్పాలి? అని నిలదీశారు. అసలు ముఖ్యమంత్రి  ఎవరికి చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు? విశాఖ కార్మికులకు చెప్పారా ? ప్రజా ప్రతినిధులకు చెప్పారా? అని ప్రశ్నించారు. కేవలం తన స్వార్ధం కోసం, విశాఖ భూములు కొట్టేయాలి అని దుర్భుద్ధితో ముఖ్యమంత్రి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. 7 వేల ఎకరాలు అమ్మేస్తానని ప్రధానమంత్రికి ఉత్తరం రాశానని ఈ ముఖ్యమంత్రి చెబుతున్నాడు... అలా రైతులు, ప్రజలు ఇచ్చిన భూములు అమ్మడానికి ఆయనెవరు? అని ఉమ ప్రశ్నించారు.