కాలుష్యం మన దైనందిన జీవితంలో భాగంగా మారిపోయిందని, అయితే దాన్ని నియంత్రించే బాధ్యత అందరిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు అవసరమే అయినా, కాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు కావాల్సిందేనని హెచ్చరించారు.