పోలవరం ప్రాజెక్ట్ సైట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్‌వే సహా మొత్తం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం, అధికారులను మరియు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.