Aug 3, 2022, 3:57 PM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల పవిత్రతను దృష్టిలో వుంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా పండించిన పదార్థాలతో దేవుళ్లకు నైవేధ్యాలు, భక్తులకు ప్రసాదాలు, భోజనం అందించేందుకు సిద్దమయ్యింది. రాష్ట్రంలోని 11 ప్రముఖ దేవాలయాల్లో దీన్ని అమలుచేయాలని నిర్ణయించారు. దీని సాధ్యాసాధ్యాలు, అమలుపై చర్చించేందుకు దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో పాటు ఇరు శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.