Nov 19, 2021, 4:29 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబు (Chandrababu Naidu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని.. తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో తెల్చకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు.