చంద్రబాబు చేతిలో అదే.. లోకేష్ చేతిలో అదే.. ఇంతకీ అందులో ఏముంది?

Jun 16, 2020, 1:41 PM IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నల్లచొక్కా వేసుకున్నారు. గతేడాది ఫిబ్రవరితో జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాడు సీఎం హోదాలో చంద్రబాబు నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చే విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, నిరసనగా నల్లచొక్కా వేసుకుని వచ్చారు.  ఏడాది తరువాత ప్రతిపక్ష నేత హోదాలో మళ్లోసారి నల్లచొక్కా వేసుకున్నారు. అయితే గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా నల్లచొక్కా వేసుకుంటే,  ఈసారి ఏపీలోని అధికార వైసీపీ తీరుకు నిరసనగా నల్లచొక్కా వేసుకున్నారు. అయితే చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరి చేతుల్లోనూ నల్ల బ్యాగులుండడం.. బడ్జెట్ సమయంలో ఈ బ్యాగులతో కనిపించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.