Jul 14, 2020, 3:11 PM IST
విజయనగరంలో బీజెపి కార్పొరేటర్ అభ్యర్థి, పార్టీ జిల్లా నాయకుడు నారాయణరావుపై హత్యా ప్రయత్నం చేయడం సిగ్గుచేటని.. ఈసంఘటను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
అన్నారు. ఇలాంటి సంఘటనలతో బీజెపి నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేవన్నారు. ఇది పూర్తిగా పిరికిపంద చర్య అని, విజయనగరంలో వైయస్సార్సీపి నేతలు కొందరు గుండాళ్లా, హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. విజయనగరంలో జల్లాలో రౌడీ రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఎం కావాలని మండిపడ్డారు.