పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అశోక్ గజపతి సతీమణి, కూతురు

27, Oct 2020, 3:23 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా విజయనగరంలోని అమ్మవారి ఆలయాన్ని మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సతీమణి సుధ గజపతి, కూతురు ఊర్మిళ గజపతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు.  విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్, కుటుంబసభ్యులు నెల్లిమర్ల శాసన సభ్యులు శ్రీ బడ్డుకొండ అప్పల నాయుడు, కుటుంబసభ్యులు అమ్మవారి దర్శించుకున్నారు