Mar 13, 2023, 4:07 PM IST
కొవ్వూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోంమంత్రి తానేటి వనిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొవ్వూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో హోంమంత్రితో పాటు మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి ఓటేసారు. మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పిటిసి, ఎంపిటిసి తదితరులు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.