Galam Venkata Rao | Published: Apr 7, 2025, 8:00 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి గిరిజన సంక్షేమ హాస్టల్‌ను పరిశీలించారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను ఆయన సమీక్షించారు. వంటశాల, స్టోర్ రూం, డైనింగ్ హాల్ తదితర ప్రాంతాల్లో పరిశీలన చేపట్టి, వాడే పదార్థాల నాణ్యతపై హాస్టల్ వార్డెన్‌ను ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.