Jan 6, 2021, 2:54 PM IST
అమరావతి: రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ జరుగుతోంది...అర్ధరాత్రి అందరూ పడుకున్నాక దేవాలయాలపై దాడులు చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. పరిస్థితి ఎలా వుందంటే దాడులు చేసినవారే మళ్లీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు.
రాజకీయ లబ్దికోసం ఇలా చేసేవారికి గుణపాఠం చెప్పాల్సిందేనన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని... పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. మళ్ళీ ఇలాంటి దాడులు చేయడానికి భయ పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సీఎం జగన్.