Dec 13, 2019, 5:26 PM IST
జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షం టీడీపీ కూడా బిల్లకు మద్దతు తెలపగా.. బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మనేని సీతారాం ప్రకటించారు. దీంతో ఆంధ్రపదేశ్ అంతటా పండగ వాతావరణం నెలకొంది. ఆడబిడ్డల రక్షణ కొరకు దిశ మహిళా రక్షణ బిల్లును చట్టం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞత తెలుపుతూ పీలేరులో విద్యార్థులు, విద్యాసంస్థలు ర్యాలీ నిర్వహించాయి.