పుష్ప 2 పై వెంకీ మామ షాకింగ్ రివ్యూ: అల్లు అర్జున్ నటన ఎలా ఉందట!

Published : Dec 11, 2024, 06:43 PM IST

బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. కాగా ఈ చిత్రం పై సీనియర్ హీరో దగ్గుబాటి వెకంటేష్ స్పందించారు. తన రివ్యూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.   

PREV
16
 పుష్ప 2 పై వెంకీ మామ షాకింగ్ రివ్యూ: అల్లు అర్జున్ నటన ఎలా ఉందట!

తెలుగు సినిమా సత్తాను మరోసారి రుజువు చేశాడు అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2.. అంచనాలకు మించి ఆడుతుంది. పుష్ప 2 మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి రూ. 1000 కోట్ల బిజినెస్ చేసినట్లు వార్తలు వచ్చాయి.ఓన్లీ  థియేట్రికల్ బిజినెస్ రూ. 600 కోట్లు. దాంతో వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్ష్ప తో 2 బాక్సాఫీస్ బరిలో నిలిచింది. 
 

26

ఈ మ్యాజిక్ ఫిగర్ ని పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే అధిగమించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ దుమ్ములేపుతుంది. హిందీ చిత్రాల రికార్డ్స్ ఒక డబ్బింగ్ మూవీ అధిగమించడం ఊహించని పరిణామం. ఫస్ట్ డే రికార్డు తో పాటు ఫాస్టెస్ట్ రూ. 300 కోట్ల రికార్డుని పుష్ప 2 హిందీ వెర్షన్ తన ఖాతాలో వేసుకుంది. ఆరు రోజులకు పుష్ప 2 మూవీ రూ. 375 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

 

36

వర్కింగ్ డేస్ లో కూడా పుష్ప 2 వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి. క్రిస్మస్ వరకు పుష్ప 2 ప్రభంజనం కొనసాగనుంది. ఈ చిత్రానికి పెద్దగా పోటీ కూడా లేదు. ముఖ్యంగా తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాల విడుదల లేదు. పుష్ప 2 ఇన్ని అద్భుతాలు చేస్తున్నా... టాలీవుడ్ సైలెంట్ గా ఉంది. ప్రముఖులు ఎవరూ మాట్లాటం లేదు. పైగా విమర్శలు గుప్పిస్తున్నారు. 

46

రాజేంద్ర ప్రసాద్ ఇటీవల అల్లు అర్జున్ పై పరోక్షంగా మాటల దాడి చేశాడు. వాడెవడో ఎర్ర చందనం దొంగ హీరో అంట అని పుష్ప 2 సినిమాను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

 

56

కాగా సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి పుష్ప 2 మూవీ చూశారట. ఆయన తన రివ్యూ ఇచ్చారు. అల్లు అర్జున్ అద్భుతమైన, ఎప్పటికీ మర్చిపోలేని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సిల్వర్ స్క్రీన్ పై అల్లు అర్జున్ ని అలా చూస్తూ ఉండిపోయాను. పుష్ప 2 సినిమాను ఇండియా వైడ్ సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే.. చాలా సంతోషంగా ఉంది. 

66
Pushpa 2, Sukumar, allu arjun


రష్మిక.. నువ్వు గొప్పగా చేశావు. దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పాటు పుష్ప 2 మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు... అని ట్వీట్ చేశారు. వెంకటేష్ షార్ట్ రివ్యూ వైరల్ అవుతుంది. 

పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, రావు రమేష్, అనసూయ, సునీల్, అజయ్ ఇతర కీలక రోల్స్ చేశారు. 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కింది. అల్లు అర్జున్ మూడేళ్ళ సమయం ఈ చిత్రానికి కేటాయించారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories