Jul 28, 2020, 5:25 PM IST
అర్హత ఉండికూడా ఇళ్ల స్థలాలు పొందని వారు ఒక్కరు కూడా ఉండకూడదని స్పందన కార్యక్రమంలో ఏపీ సీఎం వైస్ జగన్ అన్నారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఇళ్ల పట్టాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల పట్టాలు, పెన్షన్ ల అంశాలు గ్రామ సచివాలయాల్లోనే పరిష్కారం కావాలని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టగానే రచ్చబండ మొదలు పెడతానని అన్నారు.