Galam Venkata Rao | Published: Apr 10, 2025, 4:00 PM IST
రాప్తాడులో పోలీసులు, అధికారులు కుమ్మక్కై టీడీపీకి కొమ్ము కాశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. తమ పార్టీ అధినేత రాప్తాడు పర్యటనలో కావాలనే ఆటంకాలు కలిగించారని ఆరోపించారు. జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, హోం మంత్రుల కామెంట్స్‌ని ఖండించారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు.. తమ కంప్లయింట్స్ తీసుకోవడం లేదని ఆక్షేపించారు. తమకి అవకాశం వచ్చిన రోజు కచ్చితంగా పోలీసుల్ని గుడ్డలూడదీసి కొడతామని హెచ్చరించారు.