Aug 4, 2022, 2:01 PM IST
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎసిబి దాడులు కొనసాగుతున్నాయి. నందిగామ నగరపంచాయితీ కార్యాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పిర్యాదులు అందడంలో ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, ముగ్గురు సిఐ లతో కూడిన మొత్తం 30 మంది ఎసిబి బృందం ఒక్కసారిగా పంచాయితీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. నగర పంచాయితీ పరిధిలో అక్రమ నిర్మాణాలతో పాటు పలు పిర్యాదులపై ఏసిబి అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.