కేంద్ర ప్రభుత్వం గుంటూరు నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వాటిని గుంటూరుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గుంటూరు ఎన్టీఆర్ బస్టాండును ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్, ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. బస్టాండ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.