ఉత్తరాదొళ్లేనా.. తెలంగాణ రైతన్నల కష్టాలు కానొస్తలేవా: కేసీఆర్‌పై షర్మిల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 22, 2021, 4:28 PM IST
Highlights

రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం (telangana govt) తరుపున రూ. 3 లక్షల పరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ (cm kcr) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై వైఎస్సార్‌టీపీ (ysrtp) అధ్యక్షురాలు షర్మిల (ys sharmila) కూడా కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ.. వరుసగా ట్వీట్ చేశారు.

రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం (telangana govt) తరుపున రూ. 3 లక్షల పరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ (cm kcr) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణలోని విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నిర్ణయం మంచిదే అని.. కానీ తెలంగాణ ప్రజల సంగతేంటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రైతులు మరణిస్తే పరిహారం ఎందుకు ఇవ్వలేదని.. టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, (revanth reddy) తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్‌లు (bandi sanjay) సర్కారును ప్రశ్నించారు. తాజాగా వైఎస్సార్‌టీపీ (ysrtp) అధ్యక్షురాలు షర్మిల (ys sharmila) కూడా కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ.. వరుసగా ట్వీట్ చేశారు.

ట్విట్టర్ వేదికగా మరోసారి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు.’’ కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట..! బయటి రాష్ట్రం రైతులకు మూడు లక్షల రూపాయలు ఇస్తారా..? మన రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారికి , ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు, రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చారు సార్..? తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా..?‘‘ అని సీఎం కేసీఆర్ ను పరోక్షంగా వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు అభయహస్తం డబ్బులు చెల్లిస్తామని.. స్త్రీల సంక్షేమానికి, సాధికారతకు కృషి చేస్తామని షర్మిల వెల్లడించారు. 

ALso Read:YS Sharmila: ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మోసం చేస్తున్నారు.. కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

‘కష్టపడి పండించిన పంట కండ్ల ముందు కొట్టుకుపోతుంటే.. మొలకలొచ్చిన ధాన్యం కొంటారో.. కొనరో.. తెలియక ధాన్యం కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి.. కానీ, మీ గుండెలు కరగటం లేదు..’ అని సీఎం కేసీఆర్‌పై ఆమె మండిపడ్డారు. ‘ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతు కష్టాలు కానొస్తలేవు..’ అని సీఎంనుద్దేశించి షర్మిల విమర్శించారు. ‘కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే.. మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మా డిమాండ్..’ అని వైఎస్సార్‌టీపీ చీఫ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ధాన్యంకుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి కానీ
మీ గుండెలు కరుగటం లేదు.
ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవు.
కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే,
మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మా డిమాండ్ 2/2

— YS Sharmila (@realyssharmila)
click me!