అలాంటి నేతలను కేంద్రమే పిలిపించుకోవాలి...: కేసీఆర్ డిల్లీ టూర్ పై మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలు (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 22, 2021, 2:09 PM IST
Highlights

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇకపై అయినా వ్యవసాయం గురించి నిర్ణయాలు తీసుకునే ముందు రైతు సమస్యలు తెలిసిన, రైతు ప్రయోజనాలు కాపాడే నేతలను పిలిపించుకుని మాట్లాడితే మంచిదని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. 

మహబూబాబాద్: రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ  దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు... కాబట్టి వీటిని సమర్థించిన రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశప్రజలముందు ప్రధాని ఒప్పుకున్నారని అన్నారు. 

ఇకపై అయినా కేంద్రంలోని BJP Government కండ్లు తెరిచి రైతు సమస్యలు తెలిసిన, రైతు ప్రయోజనాలు కాపాడే నేతలను పిలిపించుకుని మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రైతుమేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని minister satyavathi rathode హితవు పలికారు. 

mahabubabad district మరిపెడ మండలం తాళ్ల ఊకళ్లు గ్రామంలో ఇవాళ(సోమవారం) ఉమామహేశ్వర దేవస్థానంలో లింగ పున:ప్రతిష్ట, ధ్వజస్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని... పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 

వీడియో

''కార్తీక సోమవారం రోజున ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో లింగ పున:ప్రతిష్ట, ధ్వజస్థంభం ప్రతిష్ట చేసుకోవడం... అందులో తాను భాగంకావడం నిజంగా అదృష్టం. ఈ గ్రామస్థులందరికీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను'' అని మంత్రి పేర్కొన్నారు. 

read more  మళ్లీ అదే తొండి మాట.. రైతుల నోట్లో మట్టిగొట్టే యత్నం: బండి సంజయ్‌‌పై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

''నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదే. ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై ఉన్న ఆధరాభిమానాలు, కేసిఆర్ నాయకత్వంపై ఉన్న గురికి ఇప్పటివరకు సాధించిన విజయాలు నిదర్శనం'' అన్నారు. 

''రైతులకు ఏం కావాలో అది సాధించడానికి CM KCR పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వానాకాలం పంటను, యాసంగి పంటను కేంద్రం పూర్తిగా కొనుగోలు చేయాలి'' అని కోరారు. 

''కేంద్రంలోని బిజెపి తన అనాలోచిత నిర్ణయాలతో రైతులను గత ఏడాదికాలంగా అయోమయానికి గురిచేయడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రైతు సమస్యలు తెలిసిన, రైతు ప్రయోజనాలు కాపాడే నాయకులను పిలిచి మాట్లాడి, రైతుకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇకనైనా కేంద్రం కొంతమంది ప్రయోజనాల కోసం పనిచేయడం మానుకోవాలి. లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారు, విలాసవంతమైన జీవితం గడిపేందుకు వీలుగా విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి వారికోసం కాకుండా రైతుల కోసం, సామాన్యుల కోసం పనిచేస్తే మంచిది'' అంటూ ఎద్దేవా చేసారు. 

read more  కేంద్రం పట్టించుకోకున్నా.. తెలంగాణ అండగా నిలుస్తున్నది.. 29న ‘పార్లమెంటు ఛలో’ : ఢిల్లీలో రైతు సంఘాలు

''ఎద్దు ఏడ్చిన వ్యవసాయం... రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇప్పటికైనా బిజెపి నేతలు కండ్లు తెరిచి వ్యవసాయానికి, రైతుకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను'' అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టీఆర్ఎస్ నేతలు శ్రీనివాసరెడ్డి, యాదగిరి రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, మనోజ, సత్యనారాయణ రెడ్డి, గ్రామ ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు. 
 

click me!