హైదరాబాద్‌లోని రోగ్ క్లబ్‌లో ఓ యువతిపై కొందరు యువకులు వేధింపులకు దిగారు. క్లబ్ నుంచి ఇంటికి బయల్దేరుతుండగా కారు కోసం వ్యాలెట్ పార్కింగ్‌లో ఆ యువతి ఎదురుచూస్తున్నది. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు యువకులు ఆమె చుట్టూ చేరి అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కారును తగులబెడతామని బెదిరించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: పబ్ కల్చర్ మన దేశంలోనూ సర్వసాధారణం అయిపోయింది. సాయంత్రం పూట పబ్‌లకు వెళ్లి కాలక్షేపం చేయడం.. మద్యపానం సేవించి నిషాలో ఊగడం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే, ఇలాంటి వేదికల్లోనే నేరాలకూ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తాజాగా, హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో యువతిపై కొందరు యువకులు వేధింపులకు పాల్పడ్డారు. ఆమె ఫిర్యాదు మేరకు యువకులపై కేసు నమోదైంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రోగ్ క్లబ్‌కు ఓ యువతి తన స్నేహితులతో కలిసి వెళ్లింది. పబ్‌లో గడిపిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో కొందరు ఆకతాయిలు చుట్టు మూగి వేధింపులకు గురి చేశారు. ఇంటికి బయల్దేరే క్రమంలో ఆ యువతి వ్యాలెట్ పార్కింగ్‌లో ఉన్న తన కారు కోసం యువతి ఎదురుచూస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆమె ఎదురు చూస్తుండగా అక్కడే ఉన్న కొందరు యువకులు ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడికి దిగారు. మీరు ఎవరు.. ఏం కావాలి మీకు? అంటూ ఆ యువతి వారిని ప్రశ్నించింది. కానీ, ఆ యువకులు వెనక్కి తగ్గలేదు. ఆమె కారును ఎక్స్‌చేంజ్ చేసుకుందామని మాటలు కలిపారు. ఆ తర్వాత మాటా మాటా పెరిగింది. ఆ వెంటనే యువతి కారును తగులబెడతామని బెదిరించారు.
undefined
Also Read: నిబంధనల బేఖాతరు.. హైదరాబాద్ పబ్బుల్లో ప్రత్యక్షమైన పిల్లలు, వీడియోలు వైరల్
ఎలాగోలా ఆ యువతి అక్కడి నుంచి తప్పించుకుని బయట పడింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పింది. జూబ్లీహిల్స్ పోలీసులకు ఆ యువకులపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో (hyderabad) పబ్బుల (pub) తీరు వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవలే పిల్లలు పబ్‌లో ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని (jubilee hills) ఓ పబ్‌లోకి నలుగురు పిల్లలను అనుమతించింది యాజమాన్యం. పబ్‌లో ఓ వైపు ఫుల్‌గా మద్యం తాగి నృత్యాలు చేస్తుండగానే.. పిల్లలు పబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఎక్సైజ్ శాఖ ఎన్ని దాడులు చేసినప్పటికీ .. ఎన్ని కథనాలు మీడియా ప్రసారం చేసినప్పటికీ పబ్‌ల తీరు మాత్రం మారడం లేదు. 21 సంవత్సరాల లోపు పిల్లలను, మైనర్లను పబ్‌లోకి అనుమతించకూడదని కఠిన నిబంధనలు వున్నాయి. అయినప్పటికీ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు నిర్వాహకులు.
Also Read: టాలీవుడ్ పబ్‌లో అర్ధనగ్న డ్యాన్స్‌లు, అసాంఘిక కార్యకలాపాలు.. పోలీసుల దాడితో వెలుగులోకి
నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న టాలీవుడ్ పబ్‌పై (tollywood club) ఇదే నెలలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులకు దిగారు. పబ్‌లో వికృత ఛేష్టలకు పాల్పడుతోన్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పబ్‌లో సమయం దాటిన తర్వాత కూడా యువతి యువకులు అర్థనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారని సమాచారం. ఇటీవలే ఈ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి నోటీసులు జారీ చేశారు. అయితే గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా వుంది టాలీవుడ్ పబ్. ఇటీవలే పబ్‌కు వచ్చిన భార్యాభర్తలపై పబ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేయడంతో కొంత కాలం సీజ్ చేశారు పంజాగుట్ట పోలీసులు.