ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు గంజాయి నూనె తరలింపు.. కానిస్టేబుల్ సహా ముగ్గురు అరెస్టు

By Mahesh KFirst Published Dec 23, 2021, 3:36 AM IST
Highlights

గంజాయి నూనెను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న ముఠాతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ చేతులు కలిపాడు. ఓ కారును అద్దెకు తీసుకుని వారు గంజాయి నూనెను అక్రమంగా తలిస్తుండగా పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. ఈ నిందితుల్లో 2020 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ షేక్ ముజీబ్ పాషా ఉన్నారు.

హైదరాబాద్: మాదక ద్రవ్యాల(Drugs) బెడద ముగిసేలా లేదు. గంజాయి స్మగ్లింగ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తున్నది. గుట్టు చప్పుడు కాకుండా మారుమూల ప్రాంతాల నుంచి రాజధాని నగరానికి గంజాయి పలు రూపాల్లో స్మగ్లింగ్(Smuggle) అవుతున్నట్టు అర్థం అవుతున్నది. Hyderabad నగరంలోనూ గంజాయి లభించే చోట్లు చాలానే ఉన్నట్టు ఇటీవలే కొన్ని స్టింగ్ ఆపరేషన్లలో వెలుగులోకి వచ్చాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొందరు గంజాయి మాదక ద్రవ్యాన్ని హైదరాబాద్‌లో సేవిస్తున్నట్టు సమాచారం. విదేశీ మాదక ద్రవ్యాలతోపాటు గంజాయిపైనా నిషేధం ఉన్నది. గంజాయిని పండించడమంటే చట్టాన్ని అతిక్రమించడమే. అయినా.. కొన్ని మారుమూల ప్రాంతాల్లో దీని సాగు నడుస్తున్నది. ఖమ్మంలోనూ ఈ సాగు ఉన్నట్టు తెలుస్తున్నది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు గంజాయి నూనె స్మగుల్ చేస్తుండగా పోలీసులకు పట్టుకున్నారు. ఇందులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ కూడా ప్రమేయం ఉండటం గమనార్హం.

షేక్ ముజీబ్ పాషా అనే యువకుడు ఇటీవలే ఏఆర్ కానిస్టేబుల్‌గా ఖమ్మంలో డ్యూటీలో చేరాడు. ఆయనకు ఖమ్మం జిల్లాకు చెందిన మహ్మద్ అఫ్రోజ్ మంచి స్నేహితుడు. వారిద్దరూ దగ్గరి బంధువులు కూడా. వీరు కొత్తగూడెం నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్న వారిని కనుగొన్నారు. ఉపేందర్, వెంకటేశ్‌లు కలిసి హైదరాబాద్‌కు గంజాయిని నూనె రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఆ ఏఆర్ కానిస్టేబుల్ వీరిని పట్టుకోకుండా వారితోనే చేతులు కలిపాడు. గంజాయి నూనె స్మగ్లింగ్‌లో పాలుపంచుకున్నాడు. ఉపేందర్, వెంకటేశ్‌లను మహ్మద్ అఫ్రోజ్, ఏఆర్ కానిస్టేబుల్ షేక్ ముజీబ్ పాషాలు కలుసుకున్నారు. ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

Also Read: గంజాయి సాగు చేస్తా.. అనుమతులు ఇవ్వండి: కలెక్టర్‌కు రైతు దరఖాస్తు

ఉపేందర్, వెంకటేశ్‌లతో కలిసి గంజాయి అక్రమ రవాణా నేరంలో ఏఆర్ కానిస్టేబుల్ షేక్ ముజిబ్ పాషా, మహ్మద్ అఫ్రోజ్‌లు భాగస్వాములయ్యారు. ఉపేందర్, వెంకటేశ్‌లతో కలిసి గంజాయి నూనెను అక్రమంగా హైదరాబాద్ తరలించడానికి నిశ్చయించుకున్నారు. అంతే.. వీరిద్దరు ఒక ప్రైవేటు కారును అద్దెకు తీసుకుని గంజాయి ఆయిల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాగా, ఎల్బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు, హయత్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. గంజాయి నూనె (హ్యాష్ ఆయిల్) హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అందులో 2020 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం.

కాగా, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో (Indira Gandhi International Airport) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన మహిళ (woman from Uganda) వద్ద నుంచి అధికాలురు 2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 14.14 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న మహిళను పోలీసులు అడ్డగించారు. ఆమె బ్యాగును తనిఖీ చేయగా, 2020 గ్రాముల ఆఫ్‌ వైట్‌కలర్‌లో ఉన్న పౌడర్‌ను గుర్తించారు. దానిని పరీక్షించగా అది heroin అని తేలింది. దీంతో ఆ విదేశీ మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 కింద అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

click me!