ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన వ్యాన్.. ఒకరు దుర్మరణం.. తొమ్మిది మందికి గాయాలు

By Mahesh KFirst Published Dec 23, 2021, 2:43 AM IST
Highlights

భద్రాద్రి కొత్తగూడెం నుంచి పత్తి, మిర్చి పంటను అమ్ముకోవడానికి రైతులు ములుగు వచ్చారు. అక్కడ తమ పంటను అమ్ముకుని స్వస్థలాలకు బయల్దేరారు. కానీ, చల్వాయ్, గోవిందరావు పేట గ్రామాల మధ్య బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: పండించిన పంటను మార్కెట్‌(Agricultural Market)లో అమ్మేశారు. ఆ రైతులు మళ్లీ ఇల్లు చేరడానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇల్లు చేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఉమ్మడి వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని రైతులు ప్రయాణిస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. వ్యాన్ అధిక వేగంతో ఉన్నట్టు తెలుస్తున్నది. తద్వార వ్యాన్(Van) ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనలో ఒక రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో తొమ్మిది మంది(Omicron Variant) తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.

చల్వాయి గోవిందరావు పేట గ్రామాల మధ్య బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం మండలం పోతిరెడ్డి పల్లితో పాటు ఇరుగుపొరుగు గ్రామాలకు చెందిన రైతులు తమ పంటను అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. వారంతా వరంగల్ ఎనుమాముల మార్కెట్‌ చేరుకున్నారు. పత్తి, మిర్చి అమ్ముకున్నారు. వ్యాన్‌లో స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా, చల్వాయ్ దగ్గర ఓ లారీ లోడ్ చేస్తున్నారు. వడ్ల బస్తాలను ఆ లారీలో ఎక్కిస్తున్నారు. రైతులతో వెళ్తున్న వ్యాన్ ఆ లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జయింది.

Also Read: Sangareddy Accident: కలల బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా ఘోరం... యువకుడు మృతి

ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, ఘటనా స్థలిలోనే కుంజ శ్రీనివాస్ అనే అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. కాగా, గాయపడిన మిగితా వారిని 108 అంబులెన్స్‌లో ములుగు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ప్రథమ చికిత్స తర్వాత ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు వెలడించారు.

తన కలల బైక్ ను సొంతంచేసుకున్న ఆనందంలో రయ్ రయ్ మంటూ వెళుతూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొత్త బైక్ పై ఎంతో ఆనందంతో స్వగ్రామానికి వెళుతుండగా రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ఆటో యువకున్ని బలితీసుకుంది. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా (sangareddy district)లో చోటుచేసుకుంది. 

Also Read: బడికి బయల్దేరిన ఆ ముగ్గురు అన్నదమ్ములు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

కామారెడ్డి జిల్లా (kamareddy district) నిజాంసాగర్ మండలం వెల్గనూరు గ్రామానికి చెందిన గువ్వ సాయిలు(22) ఉపాధినిమిత్తం హైదరాబాద్ (hyderabad) లో నివాసముండేవాడు. మల్లాపూర్ లో నివాసముంటూ శుభకార్యాలతో పాటు వివిధ  కార్యక్రమాలకు వేదికలను అలంకరించే (decoration) పని చేస్తుండేవాడు. 

అయితే ఎన్నో రోజులుగా సాయిలు బైక్ కొనుగోలు చేయాలని ఆశించేవాడు. ఇందుకోసం డబ్బులు కూడబెట్టి ఎట్టకేలకు మంగళవారం హైదరాబాద్ లోనే కొత్త బైక్ కొనుగోలు చేసాడు. షోరూంలో కొనుగోలుకు సంబంధించిన పనులను ముగించుకుని కొత్త బైక్ స్వగ్రామానికి బయలుదేరాడు. 

ఈ క్రమంలో జోగిపేట (jogipet) సమీపంలో అతడు మంచి వేగంతో దూసుకుపోతుండగా ఓ ఆటో రాంగ్ రూట్ లో వచ్చింది. ఒక్కసారిగా ఆటో ఎదురుగా రావడంతో బైక్  కంట్రోల్ కాకపోవడంతో అదే వేగంతో వెళ్లి ఢీకొట్టాడు.  దీంతో తలకు తీవ్ర గాయమై అధికంగా రక్తస్రావం కావడంతో సాయిలు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ చాకలి రవీందర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ముందుభాగం దెబ్బతినగా బైక్ పూర్తిగా తుక్కుతుక్కయ్యింది. 

click me!