కెసిఆర్ సభను అడ్డుకుంటాం : యూత్ కాంగ్రెస్

Published : Aug 09, 2017, 02:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
కెసిఆర్ సభను అడ్డుకుంటాం : యూత్ కాంగ్రెస్

సారాంశం

కెసిఆర్ సభను అడ్డుకుంటాం కాన్వాయిని బాల్కొండకు రానియ్యం నిరుద్యోగులను మోసం చేస్తున్నారు

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యకుండా, రైతులకు నీళ్లు ఇయ్యకుండా, పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు, కెజి టు పిజి ఉచిత విద్య ఇవ్వకుండా మాటలతో కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు తగిన బుద్ధి చెబుతామని యూత్ కాంగ్రెస్ హెచ్చరించింది. సిఎం కాన్వాయ్ ను అడుగడుగునా అడ్డుకుని నిరసన తెలుపుతామని పేర్కొంది.

సిఎం కాన్వాయ్ ని బాల్కొండలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్. లక్ష్మీ కెనాల్, కాకతీయ కెనాల్, సరస్వతి కెనాల్ ల ద్వారా రైతులు డిమాండ్ చేస్తున్న నీటిని విడుదల చేయకుండా, పునరుజ్జీవ పథకం అని ప్రజల ను మొసం చేయడమేనని ఆరోపించారు అశోక్. కమీషన్లు దండుకొవడానికే ఈ పునరుజ్జీవ పథకం చేపట్టిర్రని మండిపడ్డారు.

బాల్కొండ నియోజకవర్గం లొ తెరాస బలహీనంగా ఉందన్న భయంతోనే ముఖ్యమంత్రితో సభ పెట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రే కాదు టిఆర్ఎస్ నాయకులు మొత్తం వచ్చి బాల్కోండ లొ ప్రచారం చేసిన ఇక్కడ వచ్చే ఎన్నికల్లో గెలవలేరని తెలిపారు. .నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇక్కడ నాయకులు వ్యవహరిస్తున్న తీరు, అహంకార ధోరణి వల్ల జనాలు భయాందోళనకు గురవుతున్నారని వివరించారు.

మరోవైపు బాల్కొండలో పోలీసులు హల్ చల్ చేస్తున్నారు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యుఐ, కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారు.                     

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?